‘118’తో వస్తోన్న కళ్యాణ్ రామ్ !

Published on Dec 3, 2018 2:57 pm IST

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఓ ఇంట్రస్టింగ్ టైటిల్ తో తన 16వ చిత్రం చేస్తోన్న విషయం తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 118 అనే టైటిల్ ను ఖరారు చేశారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ డైరక్టర్ గా మారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నివేత థామస్ అలాగే ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు.

థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం ఫై మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :