ఎన్టీఆర్ బయోపిక్ లో ‘జూ ఎన్టీఆర్’ ఎందుకు నటించలేదంటే.. !

Published on Jan 5, 2019 3:50 am IST

టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో లెజండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తూ ‘ఎన్టీఆర్ బయోపిక్’ను నిర్మిస్తోన్నారు. కాగా బయోపిక్ పార్ట్స్ లో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ జనవరి 9న విడుదల కానుంది.

దాంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో జూ ఎన్టీఆర్ నటించకపోవడం గురించి మాట్లాడుతూ.. మా తమ్ముడు పెద్ద స్టార్ హీరో.. తను ఈ చిత్రంలో ఒక చిన్న పాత్ర వేసినా.. అభిమానాలు చాలా ఎక్కువుగా ఎక్స్ పెక్ట్ చేస్తారు. అంత చిన్న పాత్రతో అభిమానల అంచనాలను ఖచ్చితంగా అందుకోలేము. దాంతో అభిమానులు నిరాశపడతారు. అది బాబాయికి ఇష్టం లేదు. అందుకే కథానాయకుడు ఆడియోను తారక్ చేత లాంచ్ చేయించారని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు.

ఇక కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ బయోపిక్లో రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను పిబ్రవరి 7న విడుదల చేయనున్నారు. ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా ఈ బయోపిక్ ను నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More