శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న కళ్యాణ్ రామ్ చిత్రం !
Published on Oct 10, 2017 8:45 am IST

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో తమిళ దర్శకుడు జయేంద్ర డైరెక్ట్ చేస్తున్న చిత్రం కూడా ఉంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, కూల్ బ్రయీజీ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రం యొక్క తొలి షెడ్యూల్ పూర్తయింది.

దీంతో సుమారు 40 శాతం షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. మొదలై కొన్నాళ్లే అయినా చిత్రం ఇంత వేగంగా షూటింగ్ జరుపుకొంటుండటం విశేషమని చెప్పాలి. ప్రముఖ సినిమాటోగ్రఫర్ పి.సి. శ్రీరామ్ కెమెరా వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి శరత్ సంగీతాన్ని అందిస్తున్నారు. కిరణ్ ముప్పవకరపు, విజయ్ కుమార్ వట్టికూటి లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే కళ్యాణ్ రామ్ ఈ చిత్రంతో పాటే నూతన దర్శకుడు ఉపేంద్ర మాదవన్ దర్శకత్వంలో ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’ అనే సినిమా కూడా చేస్తున్నారు.

 
Like us on Facebook