కళ్యాణ్ రామ్ కొత్త సినిమా లాంచ్ !
Published on Jul 30, 2017 10:40 am IST


ఒకవైపు ఉపేంద్ర మాధవన్ ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’ సినిమా చేస్తూనే మరొక సినిమాను మొదలుపెట్టారు హీరో కళ్యాణ్ రామ్. దర్శకుడు జయేంద్ర డైరక్షన్లో రూపోయిందనున్న ఈ సినిమా ఈరోజే లాంచనంగా మొదలైంది. కళ్యాణ్ రామ్ సోదరుడు జూ.ఎన్టీఆర్ ఈ వేడుకకు హాజరై క్లాప్ ఇచ్చారు.

నందమయూరి హరికృష్ణ, బివిఎస్ఎన్ ప్రసాద్, డైరెక్టర్ క్రిష్ ఈ వేడుకకు హాజరుకాగా నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. టాప్ సినిమాటోగ్రాఫర్ పిసి. శ్రీరామ్ వర్క్ చేయనున్న ఈ సినిమాలో మలయాళ నటి ఐశ్వర్య కథానాయకిగా నటించనుంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ సమర్పిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను కూల్ బ్రీజీ సినిమాస్ నిర్మిస్తోంది.

 
Like us on Facebook