
వరుస సినిమాలతో మెప్పిస్తూ వస్తోన్న యువహీరో నాగశౌర్య, తాజాగా ‘అలా మొదలైంది’తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో కళ్యాణ వైభోగమే అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఈమధ్యే కూర్గ్ ప్రాంతంలో చివరిసాంగ్ను షూట్ చేసిన యూనిట్ ప్రస్తుతం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ఇప్పటికే దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ త్వరలోనే విడుదల కానున్నాయి.
ఇక కళ్యాణ్ కోడూరి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోను ఈ నెలాఖర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక కొంత ప్రొడక్షన్ మినహా సినిమా దాదాపుగా పూర్తైందని తెలుపుతూ నందిని రెడ్డి ఈ సినిమా విశేషాలు తెలియజేశారు. కళ్యాణ వైభోగమే టీమ్‌ను మిస్సవనున్నానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. నాఘశౌర్య సరసన ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేం మాళవిక నాయర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. నవంబర్ నెలలో సినిమాను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

