కమల్ కాంట్రవర్సీ పెద్దది చేసుకుంటున్నారా.. తగ్గని కన్నడ హై కోర్ట్

కమల్ కాంట్రవర్సీ పెద్దది చేసుకుంటున్నారా.. తగ్గని కన్నడ హై కోర్ట్

Published on Jun 3, 2025 10:00 PM IST

Kamal Haasan 1

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కి నటన పరంగా ఎంత గొప్ప పేరు ఉందో అందరికీ తెలిసిందే. అయితే తనకి ఈ పేరుతో పాటుగా అనేక కాంట్రవర్సీలు కూడా లేకపోలేవు. ఇలా కమల్ నుంచి రీసెంట్ గా సంచలనం రేపిన కాంట్రవర్సీ ఏదన్నా ఉంది అంటే అది కన్నడ భాషకి సంబంధించి చేసిన కామెంట్స్ అనే చెప్పాలి.

భాష అంటే ప్రాణమిచ్చే కన్నడిగులు భాషనే తాను తమ తమిళ్ నుంచి కన్నడ పుట్టింది అని చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున రచ్చ లేపాయి. అయితే తన సినిమా థగ్ లైఫ్ సినిమాని ఆపుకున్నా పర్వాలేదు నేను అయితే క్షమాపణ కోరను అని చెప్పడం కూడా షాకింగ్ గా మారింది. అయితే కర్ణాటక హై కోర్ట్ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం జరిగింది.

కమల్ అసలు ఏ ఆధారంగా తాను కన్నడ భాష తమిళ్ నుంచి పుట్టింది అని చెప్పారని నిరూపించాలని ప్రశ్నించింది. మీ మాటలతో ప్రజలు బాధ పడుతున్నారని క్షమాపణ కోరితే ఈ సమస్య సున్నితంగా పరిష్కారం అవుతుంది అని స్వీట్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు.

అయితే కమల్ ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసారు బాగానే ఉంది కానీ కన్నడ భాష తమిళ్ నుంచే పుట్టింది అని చెప్పడానికి ఆధారాలు చూపించాల్సిన భాద్యత కూడా తనపై ఖచ్చితంగా ఉంది. మరి తన దగ్గర సరైన వివరణ లేకుండానే ఇవన్నీ చేశారు అంటే ఖచ్చితంగా ఈ కాంట్రవర్సీ ముందు రోజుల్లో పెద్దదే అవుతుంది అని చెప్పక తప్పదు.

తాజా వార్తలు