“ఇండియన్ 2” పై కమల్ సాలిడ్ స్టేట్మెంట్.!

Published on May 28, 2023 3:02 pm IST

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా ప్రస్తుతం తన సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో భారీ పాన్ ఇండియా సినిమా “ఇండియన్ 2” చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ చిత్రం ఇండియన్ కి సీక్వెల్ గా వస్తుండగా శంకర్ అయితే ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో ఇప్పుడు తెరకెక్కిస్తున్నారు.

మరి ఈ సినిమా విషయంలో అవుట్ పుట్ చూసి కమల్ ఆల్రెడీ సూపర్ కాన్ఫిడెన్స్ గా ఉండగా లేటెస్ట్ గా అయితే దుబాయ్ లో తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఇండియన్ 2 పై సాలిడ్ స్టేట్మెంట్ ని అందించడం ఆసక్తిగా మారింది. మరి మళ్ళీ సేనాపతి రోల్ ని ఇన్నేళ్ల తర్వాత అంతసేపు మళ్ళీ మేకప్ వేసుకొని చేస్తుండడం ఎలా ఉందని అడగ్గా ఈసారి మరింత స్ట్రాంగ్ గా ఉంటుంది.

అందుకే శంకర్ సినిమా టైటిల్ లో కూడా ఓల్డర్ అండ్ వైజర్ అనే ట్యాగ్ పెట్టారు. ఇది ఒక్క సేనాపతికి మాత్రమే కాదు మా మొత్తం సినిమా టెక్నీషియన్స్ కి కూడా వర్తిస్తుంది అని సీక్వెల్ కి ఎప్పటికన్నా మరింత స్ట్రాంగ్ గా ఉన్నామని అయితే ఫైనల్ గా తన మాటలతో నమ్మకం వ్యక్తం చేశారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :