స్టార్ డైరెక్టర్ శంకర్ – కమల్ హాసన్ ల కలయికలో భారతీయుడు సీక్వెల్ ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. డిసెంబరు నెలాఖర్లో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం పూర్తిగా రాజకీయాల పై నడిచే సినిమా కావడంతో కమల్ హాసన్ ఈ సినిమా ద్వారా తన రాజకీయ ఆలోచనలను, తన రాజకీయ విధానాలను మరియు లక్ష్యాలను ఈ సినిమాలో చర్చించాలని కమల్ భావిస్తున్నారట. ఈ మేరకు శంకర్ తో కమల్ స్టోరీ డిస్కషన్స్ ను కూడా చేసినట్లు సమాచారం.
కాగా ఇతర భారతీయ భాషలన్నిట్లోనూ ఈ సినిమా విడుదల అవ్వనుంది. అందుకే ఇతర భాషల నటులను కూడా ఈ సినిమాలో తీసుకుంటున్నాడు శంకర్. తెలుగు కమెడియన్ వెన్నల కిషోర్ ను ఈ సినిమాలో ఓ కామిక్ పాత్రను చేయనున్నాడు. అలాగే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ్ హీరో శింబు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించనున్న విషయం తెలిసిందే. కమల్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటిస్తోంది.
అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్ముస్తోంది.


