తెలుగులో సాలిడ్ గా పికప్ అవుతున్న “విక్రమ్”..!?

Published on Jun 4, 2022 9:01 am IST

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా ఫహద్ ఫాజిల్, మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి లు కీలక పాత్రల్లో హీరో సూర్య మాస్ క్యామియో లో కనిపించిన ఇండియాస్ లేటెస్ట్ మాస్ మల్టీ స్టారర్ “విక్రమ్”. దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిన్నటి ఫస్ట్ షో నుంచే సాలిడ్ పాజిటివ్ టాక్ ని అన్ని భాషల్లో సొంతం చేసుకుంది.

అలాగే మన తెలుగులో కూడా డీసెంట్ బజ్ తోనే రిలీజ్ అయినా తర్వాత మాత్రం ఓ రేంజ్ లో పికప్ అయ్యినట్టు తెలుస్తుంది. మార్నింగ్ షో నుంచి మంచి టాక్ తెలుగు స్టేట్స్ లో కూడా పడడం ప్రతి ఒక్కరి రోల్ ఓ రేంజ్ లో ఉందని తెలియడంతో నెక్స్ట్ షోస్ నుంచి సాలిడ్ అక్యుపెన్సీతో పికప్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనితో అయితే ఈ వారాంతానికి విక్రమ్ మన దగ్గర మంచి నంబర్స్ నమోదు చెయ్యడం గ్యారెంటీ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :