‘కమ్మ రాజ్యంలో…’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

Published on Oct 21, 2019 7:58 pm IST

మొత్తానికి రామ్ గోపాల్ వర్మ తన వివాదాస్పద సినిమాలను అలాగే కంటిన్యూ చేస్తూ.. తెరకెక్కిస్తోన్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా నుండి లేటెస్ట్ అప్ డేట్ తెలిసింది. దీపావళి కానుకగా ఈ సినిమా ట్రైలర్ ను అక్టోబర్ 27 న రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. ఇక ఇటివలే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ‘బాబు చంపేస్తాడు’ అనే వీడియో లిరికల్ సాంగ్ కూడా ఎప్పటిలాగే వివాదాస్పదమైన పదాలతో ఓ నాయకుడిని బాగా టార్గెట్ చేస్తూ వచ్చింది. కానీ సాంగ్ మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

కాగా కులాల్ని బేస్ చేసుకుని ఉండనున్న ఈ ప్రాజెక్ట్ పట్ల మొదట్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా వర్మ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఇప్పటీకే సినిమా చిత్రీకరణను శరవేగంగా జరుపుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లోని వ్యక్తి చంద్రబాబు వేషధారణలో ఉండటంతో టీడీపీ కార్యకర్తలు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయారు. ఏమైనా సినిమా పేరుతోనే రెండు ప్రధాన సామాజిక వర్గాల నడుమ జరిగే రాజకీయ పోరునే వర్మ సినిమాగా తీస్తున్నాడట. అసలు టైటిలే వివాదాస్పదంగా ఉందనుకుంటే.. సినిమా అంతకన్నా వివాదాస్పదంగా ఉండేలా కనిపిస్తోంది.

సంబంధిత సమాచారం :

More