సెన్సార్ పనులు ముగించుకున్న ‘కణం’ !
Published on Feb 12, 2018 6:02 pm IST

‘ఫిదా’ అనే ఒక్క సినిమాతోనే తెలుగునాట సంచలనం సృష్టించి భారీ క్రేజ్ సొంతం చేసుకున్న నటి సాయి పల్లవి, ఇటీవలే ‘ఛలో’ చిత్రంతో సక్సెస్ అందుకున్న యంగ్ హీరో నాగ శౌర్య కలిసి నటించిన చిత్ర్రం ‘కణం’. తమిళంలో ‘కారు’ గా రూపొందిన ఈ సినిమా చాలా రోజులు వాయిదాపడుతూ వచ్చి ఎట్టకేలకు ఫిబ్రవరి 23న విడుదలకానుంది.

తాజాగా సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఎలాంటి కట్స్ లేకుండా చిత్రానికి U/A సర్టిఫికెట్ ను జారీ చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్ర తెలుగు హక్కుల్ని ఎన్వీఆర్ సినిమాస్ అధినేత ఎన్వీ ప్రసాద్ ఫ్యాన్సీ రేటుకి కొనుగోలుచేసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ డైరెక్ట్ చేసిన ఈ ద్విభాషా చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది.

 
Like us on Facebook