ఇంట్రెస్టింగ్ కంగనా రనౌత్ కిల్లర్ లేడీ లుక్.

Published on Jul 6, 2019 11:10 am IST

కంగనా రనౌత్ బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ అఫ్ అడ్రెస్ గా మారింది. ఆమె వరుస అవకాశాలు దక్కించుకుంటూ బాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. ఇటీవలే భారీ పీరియాడిక్ మూవీ “మణికర్ణిక” లో ఝాన్సీ రాణిగా నటించి ప్రశంసలందుకున్న ఈమె ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో రాజ్ కుమార్ రావ్ హీరోగా వస్తున్న “జడ్జిమెంటల్ హై క్యా” మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత అశ్విన్ అయ్యర్ తివారి దర్శకత్వంలో “పంగా” అనే క్రీడా ప్రధాన చిత్రంలో నటించనున్నారు.

తాజాగా ఆమె నటిస్తున్న మరో చిత్రం “ధాకడ్” లుక్ ఒకటి విడుదలైంది. యుద్ధ వాతావరణం బ్యాక్ గ్రౌండ్ లో రెండు చేతులలో మారణాయుధాలతో నిల్చొని ఉన్న కంగనా లుక్ చూస్తుంటే ఇది కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. రజనీష్ రాజి ఘాయ్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీని సోహైల్ మాక్లాయ్ నిర్మిస్తుండగా,వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదల కానుందట. వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో లో షూటింగ్ మొదలుకానుంది సమాచారం

సంబంధిత సమాచారం :

More