ఉయ్యాలవాడలో భాగం కానున్న కన్నడ స్టార్ హీరో!


కన్నడ స్టార్ హీరో ఈగతో తెలుగు ప్రేక్షకులకి చేరువైన కిచ్చ సుదీప్ కి కన్నడలో ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుగులో కూడా అదే స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. అయితే ఇప్పుడు ఈ స్టార్ హీరో మరో తెలుగు సినిమాలో భాగం అవుతాడని సమాచారం. అది కూడా చిరంజీవి కొత్త సినిమా ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కోసం. కొనెదల ప్రొడక్షన్స్ తో రామ్ చరణ్ నిర్మాతగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ఇప్పటికే అమితాబ్ వంటి బాలీవుడ్ స్టార్ భాగం అవుతున్నాడని తెలుస్తుంది. అలాగే స్టార్ హీరోయిన్ నయనతార కూడా ఈ సినిమా కోసం రెడీ అవుతుంది. ఇప్పుడు చిత్ర యూనిట్ ఓ ఇంపార్టెంట్ పాత్ర కోసం సుదీప్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అదే జరిగితే ఈ సినిమా రేంజ్ నేషనల్ స్థాయిలోకి వెళ్ళిపోవడం గ్యారెంటీ.