ఇంట్రెస్టింగ్ : కార్తికేయ – 2 టీమ్ నుండి ట్రెజర్ హంట్ … డీటెయిల్స్ ఇవే

Published on Jul 31, 2022 2:00 am IST

నిఖిల్ సిద్దార్ధ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వంలో లేటెస్ట్ గా తెరకెక్కిన మూవీ కార్తికేయ 2. ఎనిమిదేళ్ల క్రితం రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన కార్తికేయ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగష్టు 12న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. భారీ ఖర్చుతో హై టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందిన ఈ మూవీని అభిషేక్ అగర్వాల్, టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ అదిరిపోయే థ్రిల్లింగ్, యాక్షన్ అంశాలతో అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచింది.

అయితే విషయం ఏమిటంటే, తమ మూవీ యొక్క ప్రమోషన్ ని ఒకింత డిఫరెంట్ గా ప్లాన్ చేసిన కార్తికేయ 2 యూనిట్, మూవీ సంబంధించి ఒక ట్రెజర్ హంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో గెలిచిన వారికి రూ. 6 లక్షల విలువ చేసే కృషుడి బంగారు ప్రతిమలు బహుమతిగా ఇవ్వనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్ లలో నిర్వహించనున్న ఈ ట్రెజర్ హంట్ పలు క్లూల ఆధారంగా సాగనుంది. కాగా ఫస్ట్ క్లూని రేపు ఉదయం 11 గంటలకు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా రివీల్ చేయనున్నారు. ఆ విధంగా వరుసగా లభించే క్లూలని ఆధారంగా చేసుకుని ఫైనల్ గా ట్రెజర్ హంట్ లో గెలవాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ ట్రెజర్ హంట్ కార్తికేయ 2 మూవీకి మరింత పబ్లిసిటీ తీసుకువస్తుందని అంటున్నారు విశ్లేషకులు.

సంబంధిత సమాచారం :