గుణ స్పీడ్ మాములుగా లేదు

Published on Aug 3, 2019 8:24 am IST

యంగ్ హీరో కార్తికేయ,అనఘా జంటగా నటించిన “గుణ 369” నిన్న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు అర్జున్ జంధ్యాల తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తిరుమల రెడ్డి,అనిల్ కడియాల నిర్మించడం జరిగింది. “గుణ 369” చిత్రానికి మంచి ఆదరణ దక్కడంతో చిత్ర యూనిట్ నిన్న సక్సెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు చిత్రంపై ప్రేక్షకులు చూపిన ఆదరణకు కృతఙ్ఞతలు తెలిపారు.

కాగా హీరో కార్తికేయ ట్విట్టర్ వేదికగా “గుణ 369” విజయానికి ఆనందం వ్యక్తం చేశారు. అలాగే దర్శకుడు అర్జున్ జంధ్యాలను ఉద్దేశిస్తూ, అన్నయ్యతో మరో మూవీ ప్రకటిస్తున్నాను, ఆయన దర్శకత్వంలో మరో మారు నటించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అన్నారు. మీకు వేరే ఆప్షన్ ఉన్నా లేకున్నా నాతోనే చేయాలంటూ ప్రేమపూర్వక ఆర్డర్ వేశాడు. కార్తికేయ చెవుతున్న సమాచారాన్ని బట్టి, అర్జున్ జంధ్యాలతో ఆయన చేయనున్న చిత్రం ఈ ఏడాది చివర్లో మొదలుకానుంది.

“హిప్పీ” విడుదలైన రెండు నెలలలోపే “గుణ 369” చిత్రాన్ని విడుదల చేసిన కార్తికేయ వెంటనే మరో చిత్రాన్ని ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. నాని హీరోగా రానున్న “గ్యాంగ్ లీడర్” చిత్రంలో కార్తికేయ ప్రతినాయకుడి పాత్ర చేయడం జరిగింది. ఇటీవల విడుదలైన “గ్యాంగ్ లీడర్” టీజర్ లో ఫార్ములా వన్ రేసర్ గెట్ అప్ లో స్టైలిష్ లుక్ లో కనిపించారు.

సంబంధిత సమాచారం :