యూట్యూబ్‌లో ఇప్పటికీ కాటమరాయుడిది అదే జోరు!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా గత నెలరోజులుగా ఎంతగానో ఎదురుచూస్తోన్న ‘కాటమరాయుడు’ టీజర్ నిన్న సాయంత్రం విడుదలైన విషయం తెలిసిందే. కాటమరాయుడు అనే పవర్ఫుల్ రోల్‌లో పవన్ నటిస్తోన్న ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి నెలాఖర్లో విడుదల కానుంది. ఇక సినిమా ఎలా ఉండబోతోందో పరిచయం చేస్తూ వచ్చిన ఫస్ట్ టీజర్ యూట్యూబ్‌లో నిన్నట్నుంచీ ట్రెండింగ్‌గానే కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‌లో నెంబర్ 1 ట్రెండింగ్‌గా దూసుకుపోతోంది.

ఇక 24 గంటల్లో 34 లక్షలకు పైగా వ్యూస్‌తో సౌతిండియన్ సినిమాలో కబాలి తర్వాతి రికార్డును కాటమరాయుడు టీజర్ నెలకొల్పింది. ఇక లైక్స్ విషయంలో సుమారు 150కే లైక్స్ సాధించిన ఈ టీజర్, సౌతిండియన్ రికార్డుగా నిలిచింది. ఈ టీజర్‌తో ఇప్పటికే అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపవ్వగా, అంచనాలు కూడా తారాస్థాయికి చేరిపోయాయి. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి