రామేశ్వరం వెళ్ళనున్న ‘కాటమరాయుడు’..!
Published on Oct 2, 2016 11:42 am IST

katamarayudu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘కాటమరాయుడు’ అనే సినిమా ఈమధ్యే సెట్స్‌పైకి వెళ్ళిన విషయం తెలిసిందే. చాలా నెలల క్రితమే అనౌన్స్ అయిన ఈ సినిమా అనుకోని కారణాలతో వాయిదా పడుతూ వచ్చి ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ షూట్ హైద్రాబాద్‌లో జరగ్గా, తాజాగా ఈనెల 5నుంచి రెండో షెడ్యూల్ మొదలుకానుందని టీమ్ తెలిపింది. తమిళనాడులోని రామేశ్వరంలో భారీ ఎత్తున ఈ షెడ్యూల్ జరగనుంది.

నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు డాలీ దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో జరిగే ప్రేమకథగా ప్రచారం పొందుతోన్న ఈ సినిమాకోసం పవన్ కళ్యాణ్ ఓ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. నిర్విరామంగా షూటింగ్ జరిపి డిసెంబర్ కల్లా ప్రొడక్షన్ మొత్తం పూర్తి చేయాలని టీమ్ ప్లాన్ చేసింది.

 
Like us on Facebook