ఆసక్తికరంగా కవచం ట్రైలర్ !

Published on Dec 2, 2018 1:00 pm IST

యువ హీరో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ నటించిన 5వ చిత్రం ‘కవచం’ ట్రైలర్ కొద్దీ సేపటి క్రితం విడుదలైంది. ఇక ట్రైలర్ చూస్తే ఇది ఒక యాక్షన్ ప్యాకెడ్ థ్రిల్లర్ సినిమా గా అనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్ గా సాయి శ్రీనివాస్ పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు. నిల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడి గా అజయ్ , హరీష్ ఉత్తమ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్నినూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల తెరకెక్కించారు. మొత్తానికి ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండి సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఈ చిత్రం యొక్క ఆడియో వేడుక ఈ రోజు భీమవరంలోని చిన్నమిరం సాగి రామకృష్ణం రాజు ఇంజనీరింగ్ కళాశాలలో సాయంత్రం 6గంటలకు జరుగనుంది.

తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో కాజల్ , మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు. వంశధార క్రియేషన్స్ నిర్మించిన ఈచిత్రం డిసెంబర్ 7న విడుదల కానుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :