ఓటిటి లోకి వచ్చేసిన కీడా కోలా…వారికి మాత్రమే!

ఓటిటి లోకి వచ్చేసిన కీడా కోలా…వారికి మాత్రమే!

Published on Dec 28, 2023 8:00 AM IST

తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన క్రైమ్ కామెడీ చిత్రం కీడా కోలా. థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. ఇప్పుడు OTT స్పేస్‌లో డిజిటల్ అరంగేట్రం చేసింది. ఈ చిత్రం ఆహాలో ప్రసారానికి అందుబాటులో ఉంది. అయితే ఇది ప్రస్తుతం ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ హోల్డర్‌ కి మాత్రమే ప్రసారం చేయబడుతుంది.

మిగిలిన సబ్‌స్క్రైబర్‌లు రేపటి నుండి దీన్ని చూడవచ్చు. ఓటిటి ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. కీడా కోలాలో బ్రహ్మానందం, చైతన్య రావు, రాగ్ మయూర్, రఘు రామ్, జీవన్ కుమార్, విష్ణు ఓయ్ వంటి ప్రముఖ నటులు వివిధ పాత్రల్లో నటించారు. రానా దగ్గుబాటి సమర్పణలో విజి సైన్మా ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ సాగర్ సంగీత దర్శకుడిగా పనిచేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు