‘మహానటి’ తన కెరీర్లోనే భారీ చిత్రమంటున్న కీర్తీ సురేష్ !

6th, February 2018 - 08:43:55 AM

తెలుగులో రూపొందుతున్న ఆసక్తికరమైన చిత్రాల్లో ‘మహానటి’ కూడా ఒకటి. అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బోలెడు అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమాను చాలా శ్రద్దగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ తో పాటు సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మోహన్ బాబు వంటి స్టార్ నటీ నటులు నటిస్తున్నారు.

ఇందులో సావిత్రి పాత్రలో నటిస్తున్న కీర్తి సురేష్ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఇదే తన కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రమని, తనకు సుమారు 120 వరకు కాస్ట్యూమ్స్ ఉంటాయని తెలిపారు. నాగ్ అశ్విన్ కథ చెప్పాక ఇలాంటి గొప్ప పాత్రను కెరీర్లో చాలా ముందుగానే చేస్తున్నానేమోనని అనిపించింది. సావిత్రిగారి గురించి అందరికీ తెలియని విషయాలు చాలా ఉన్నాయి, ఇందులో వాటిని చూడవచ్చు. అశ్విన్ రాసిన స్క్రీన్ ప్లే నన్ను ఆశ్చర్యపరచింది అన్నారు. మార్చి 29న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.