ఇటీవలే విడుదలైన “గుడ్ లక్ సఖి” టీజర్ తో ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్ కీర్తీ సురేష్ కేవలం అలాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు మాత్రమే కాకుండా హీరోయిన్ గా కూడా కెరీర్ ను రాణిస్తున్న ఈ మహానటి ఇప్పుడు ఓ విలక్షణ దర్శకునితో కలిసి స్క్రీన్ పంచుకోనున్నారు..
7/జి బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, యుగానికి ఒక్కడు లాంటి వైవిధ్య చిత్రాల దర్శకుడు సెల్వ రాఘవన్ అరుణ్ మాతేశ్వరన్ అనే దర్శకుని చిత్రంలో నటించనున్నారట. అలాగే ఈ చిత్రంలో కీర్తీ సురేష్ కూడా నటించనుంది.
అలా ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ కు కూడా మంచి స్పందన వచ్చింది. ఆయనతో నటించడం తనకు ఎగ్జైటింగ్ గా ఉందని కూడా కీర్తి తెలిపింది.మరి క్రేజీ కాంబో ఎలా ఉండనుండో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు.


