భారీ ధరకి “కేజీయఫ్ 2” శాటిలైట్ హక్కులు.?

Published on Aug 21, 2021 9:00 am IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ల కాంబోలో తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. పార్ట్ 1 భారీ హిట్ కావడంతో దీనిపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా నిన్ననే ఈ చిత్రం తాలూకా శాటిలైట్ హక్కులు సౌత్ ఇండియన్ భాషలకు సంబంధించి డీల్ జీ సంస్థల వారికి క్లోజ్ అయ్యాయని కన్ఫర్మ్ అయ్యింది.

అయితే భారీ ధరకే ఈ హక్కులు అమ్ముడు పోయాయని తెలిసింది కానీ అసలైన ఫిగర్ ఎంత అన్నది ఎక్కడా రివీల్ కాలేదు. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న బజ్ ప్రకారం దీనికి కూడా అన్ని భాషల్లో రికార్డు బ్రేకింగ్ ధరనే పలికినట్టు తెలుస్తుంది. మరి దాని ప్రకారం హిందీ మినహా మిగతా భాషల హక్కులు కలిపి వంద కోట్లకి పైగానే ధర పలికినట్టు తెలుస్తుంది. ఇది భారీ మొత్తమే అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో పలువురు స్టార్ నటులు కూడా నటిస్తుండగా హోంబలే పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :