ట్రైలర్ 2తో ఆకట్టుకున్న రాకింగ్ స్టార్ !

Published on Dec 6, 2018 2:00 am IST

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రాబోతున్న తాజా చిత్రం ‘కేజీఎఫ్’. ఇప్పటికే ఐదు భాషల్లో విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ అత్యధిక వ్యూవ్స్‌ తో సినిమా పై భారీ అంచనాలను పెంచింది. కాగా తాజాగా ఈ చిత్రం సెకెండ్ ట్రైలర్ ను కూడా చిత్రబృందం విడుదల చేసింది. ‘నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలియదు, కాని చచ్చిపోయేటప్పుడు మాత్రం ఒక రాజు లాగా, పెద్ద శ్రీమంతుడవై చచ్చిపోవాలి’ అంటూ మొదలైన ఈ ట్రైలర్ 2 ఎమోషనల్ గా సాగుతూ బాగా ఆకట్టుకుంది.

కాగా లెజెండరీ నటులు కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకం పై రాకింగ్ స్టార్ యష్ హీరోగా రూపొందిన ఈ చిత్రం ‘కేజీఎఫ్(కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)’. విజయ్ కిరగందూర్ నిర్మాణంలో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను, వారాహి చలన చిత్ర బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి తెలుగులో విడుదల చేస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

X
More