నైజాంలో దూసుకుపోతున్న ‘కేజీఎఫ్ 2`!

Published on Apr 18, 2022 10:31 am IST

షార్ప్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన `కేజీఎఫ్ చాప్టర్- 2` ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతూ దూసుకువెళ్తుంది. ఈ సినిమా అన్ని చోట్లా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతుంది. కాగా నైజాంలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా లేటెస్ట్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజాంలో కేజీఎఫ్ చాప్టర్- 2` దూసుకుపోతోంది. 4వ రోజు కూడా 5.50 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తం 4 రోజులకు గానూ ఇప్పటివరకు ఈ చిత్రం 28 కోట్ల షేర్ ను రాబట్టింది. రానున్న రోజుల్లో ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కలెక్షన్స్ పట్ల సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా యశ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :