‘ఖైదీ నంబర్ 150’ ఫస్ట్ వీక్ కృష్ణా జిల్లా కలెక్షన్స్!
Published on Jan 18, 2017 9:04 am IST

khaidi
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. తొమ్మిదేళ్ళ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా కూడా ఎక్కడా ఆయన క్రేజ్ తగ్గలేదని ‘ఖైదీ నంబర్ 150’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఋజువుచేసేస్తున్నాయి. ఇక నిన్నటితో మొదటివారం పూర్తి చేసుకున్న ఈ సినిమా నేటినుంచి విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. మొదటివారం ఎవ్వరూ ఊహించని వసూళ్ళు రాబట్టిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో రికార్డు వసూళ్ళు రాబట్టింది.

కృష్ణా జిల్లాలో మొదటివారం పూర్తయ్యేసరికి ‘ఖైదీ నంబర్ 150’ 4.13 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. ఈ ప్రాంతంలో ఇప్పటివరకూ మొదటివారం కలెక్షన్స్ విషయంలో ఇదే రికార్డుగా చెప్పబడుతోంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిరు స్టైల్ కమర్షియల్ ఎంటర్‍టైనర్‌ను రామ్ చరణ్ నిర్మించారు. ఈవారం కూడా పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో కలెక్షన్స్ ఇదే స్థాయిలో ఉంటాయని ట్రేడ్ భావిస్తోంది.

 
Like us on Facebook