ఇంటర్వ్యూ : కియరా అద్వానీ – వివిఆర్ తో తెలుగులో మరో విజయాన్ని సొంతం చేసుకుంటాను !

Published on Jan 4, 2019 5:05 pm IST

భరత్ అనే నేను తో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ కియరా అద్వానీ నటించిన తాజా చిత్రం ‘వినయ విధేయ రామ’. ఈసినిమా జనవరి 11న విడుదలకు సిద్దమవుతున్న సందర్భంగా కియరా మీడియాతో మాట్లాడారు. ఆవిశేషాలు మీకోసం..

ఈచిత్రంలో మీ పాత్ర గురించి ?

ఈ సినిమాలో సీత అనే పాత్రలో నటించాను. ఫ్యామిలీ ఉన్నప్పుడూ చాలా ట్రెడిషనల్ గా వుంటాను. రామ (చరణ్ ) , సీత మాత్రమే వున్నప్పుడు సీత పాత్ర ఎక్కువగా డామినేట్ చేస్తుంది. ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుటుంది.

చరణ్ తో డ్యాన్స్ చేయడం ఎలా అనిపిస్తుంది ?

చరణ్ చాలా మంచి డ్యాన్సర్ మనుకు తెల్సిందే. ఆయన కూడా నాతో డ్యాన్స్ చేయడం చాలా ఇష్టమని చెప్పారు. ఈసినిమాలో రామ లవ్స్ సీత అనే సాంగ్ నాకు చాలా బాగా ఇష్టం. ఆపాటలో డాన్స్ కూడా బాగుంటుంది.

ఈచిత్రంలో మీరు ఏమైనా యాక్షన్ సీన్స్ లో కనిపిస్తారా ?

నేను ఈ సినిమాలో ఎలాంటి ఫైట్స్ చేయలేదు కాని ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాల్లో కనిపిస్తాను. ఇక డౌట్ లేకుండా ఈ చిత్రానికి యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ అవ్వుతాయి. చరణ్ లో మరో రాంబో ను చూస్తారు.

ధోని చిత్రం మీ కెరీర్ కు బాగా ఉపయోగపడింది అనుకుంటున్నారా ?

అవును. ధోని లో సాక్షి పాత్రలో నటించాను. నాకు చాలా ఇష్టమైన పాత్ర అది ఇప్పటికి నేను బయటికి వెళ్తే సాక్షి ధోని అని పిలుస్తుంటారు. కొరటాల శివ గారు ఆ సినిమా చూసి భరత్ అనే నేను లో ఛాన్స్ ఇచ్చారు. మహేష్ గారి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమవ్వటం చాలా ఒక డ్రీం లా అనిపిస్తుంది. ఇక అక్కడి నుండి నేను వెనుతిరిగి చూసుకోలేదు.

మీరు ఇంతవరకు ఎన్ని తెలుగు డబ్బింగ్ సినిమాలు చూశారు ?

అర్జున్ రెడ్డి అలాగే శ్రీమంతుండు , మగధీర ఇంకొన్ని చూశాను. తెలుగు బాష నేర్చుకోవాలనుంది. నేను తెలుగు మాట్లాడలేను కాని కొంచెం కొంచెంఅర్ధం చేసుకుంటున్నాను.

తెలుగులో మీ తదుపరి చిత్రాల గురించి ?

ప్రస్తుతానికైతే ఏం చెప్పలేను. నా కాన్సంట్రేషన్ అంత వినయ విధేయ రామ పైనే వుంది. అది విడుదల అయ్యాక నా నటన గురించి ప్రేక్షకుల స్పందన చూసి అప్పుడు డిసైడ్ అవుతాను.

మీరు సినిమా చేయాలంటే ఏం చూసి ఒప్పుకుంటారు ?

నా పాత్ర బాగుండాలి. సినిమా స్క్రిప్ట్ బాగుండాలి వినయ విధేయ రామ కూడా ఆలా చేసింది. నేను ఫస్ట్ స్క్రిప్ట్ గురించే ఆలోచిస్తాను.

సంబంధిత సమాచారం :