‘కొబ్బరిమట్ట’కి సెన్సార్ అయింది !

Published on Jul 5, 2019 8:05 pm IST

రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వంలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా వస్తోన్న సినిమా ‘కొబ్బరిమట్ట’. గత నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఎట్టకేలకూ విడుదల డేట్ ఫిక్స్ చేసుకుంది. కాగా తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A ‘ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది ఈ చిత్రం.

ఇక ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు మూడు డిఫరెంట్స్ షేడ్స్‌లో కనిపించబోతున్నాడు. “హృదయ కాలేయం” అనే మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంపూర్ణేష్ బాబు, హృదయ కాలేయం తరువాత ‘సింగం 123’లో నటించినా అది పెద్దగా ఆడలేదు. దాంతో సంపూకి అవకాశాలు తగ్గాయి. మరి “కొబ్బరి మట్ట” హిట్ అయితే సంపూకి మళ్లీ ఛాన్స్ లు వస్తాయోమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More