భారీ రెస్పాన్స్ తో ట్రెండింగ్ లోకి వచ్చేసిన “కొమురం భీమ్” సాంగ్.!

Published on May 7, 2022 1:00 pm IST

మన టాలీవుడ్ నుంచి వచ్చిన ఒక ఆల్ టైం నెవర్ బిఫోర్ మల్టీ స్టారర్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” సినిమానే అని చెప్పాలి. ఈ సెన్సేషనల్ కాంబోపై ఎన్ని అంచనాలు అయితే ఉంటాయో ఆ అన్ని అంచనాలకి తగ్గట్టుగానే ఈ చిత్రం తెరకెక్కి భారీ వసూళ్లను రాబట్టింది.

అయితే ఈ సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్స్ గా నిలిచిన అంశాల్లో ప్రేక్షకులని ఎంతగానో కదిలించిన “కొమురం భీముడో” సాంగ్ కూడా ఒకటి. ఎన్టీఆర్ లోని పరిపూర్ణమైన నటుడుని ఇండియన్ సినిమా దగ్గర ఓ రేంజ్ లో చూపించిన ఈ సాంగ్ సినిమా రిలీజ్ తర్వాత కేవలం ఎన్టీఆర్ వల్లనే ఇంత పెద్ద హిట్ అయ్యిందని చెప్పినా ఎలాంటి తప్పు లేదు. ఆ రేంజ్ పెర్ఫామెన్స్ తో తారక్ అందరినీ కట్టిపడేసాడు.

దీనితో ఎంతో మోస్ట్ అవైటెడ్ గా నిలిచిన ఈ ఫుల్ సాంగ్ ని మేకర్స్ నిన్న రిలీజ్ చెయ్యగా దీనికి ఇప్పుడు భారీ రెస్పాన్స్ వస్తుంది. ఇంకా 24 గంటలు దాటక ముందే 4 మిలియన్ కి పైగా వ్యూస్ 3 లక్షల దాటి లైక్స్ సహా యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ లోకి అప్పుడే వచ్చేసింది. మరి ఈ సాంగ్ హవా అయితే ఇప్పుడప్పుడే ఆగేది మాత్రం కాదని చెప్పాలి. ఫైనల్ గా అయితే ఎక్కడ ఆగుతుందో చూడాలి.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :