సీక్వెల్ చేసే ఆలోచనలో కొరటాల శివ !
Published on Apr 23, 2018 11:37 am IST


దర్శకుడు కొరటాల శివ ‘భరత్ అనే నేను’తో మరొక సూపర్ హిట్ ను ఖాతాలో చేసుకున్నాడు. మహేష్ బాబు నటించిన ఈ చిత్రం అందరి ప్రశంసలు అందుకుంటూ పెద్ద మొత్తంలో వసూళ్లను రాబడుతోంది. ప్రస్తుతం రాజకీయలను ప్రస్తావిస్తూ ఈ సినిమా ఉన్న సామాజిక సందేశం అందరినీ ఆకట్టుకుంటోంది.

దీంతో కొరటాల శివ రాజకీయపరమైన ఈ సందేశం దేశ ప్రజలందరికీ అవసరమైనదని అందుకే హిందీ, ఇతర భాషల్లో కూడ చిత్రాన్ని అనువదిస్తామని అలాగే సీక్వెల్ రూపొందించాలనే ఆలోచన బలంగా ఉందని అన్నారు. అంటే ఈ సీక్వెల్ లో భరత్ రెండోసారి ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఏం జరిగింది, ఎలాంటి రాజకీయపరమైన మార్పులు తీసుకొచ్చాడనేవి ప్రధానాంశాలుగా నడుస్తాయన్నమాట. మరి కొరటాల తన ఆలోచనను ఎప్పుడు ఆచరణలో పెడతారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook