కొరటాల సినిమాలో రామ్ చరణ్ ?

కొరటాల సినిమాలో రామ్ చరణ్ ?

Published on Dec 14, 2018 9:50 PM IST

దర్శకుడు కొరటాల శివ తన తర్వాత చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నారని గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదొక వార్త హల్ చల్ చేస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కొరటాల, మెగాస్టార్ కోసం రాస్తోన్న స్క్రిప్ట్ లో ఒక కీలకమైన పాత్రని కూడా రాసుకున్నాడట.

అయితే ఆ పాత్రలో రామ్ చరణ్ ని తీసుకోబోతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. రామ్ చరణ్ ది గెస్ట్ రోలా లేక కొన్ని నిమిషాల పాటు సాగే ముఖ్యమైన రోలా అనే విషయం తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం మెగాస్టార్ స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ సైరా నర్సింహారెడ్డి’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తీ అయ్యాక చిరంజీవి – కొరటాల శివ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు