ఎన్టీఆర్ హీరోయిన్ పై రూమర్స్ వస్తూనే ఉన్నాయి !

Published on Jan 3, 2022 9:02 pm IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా సమంత ను తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, ఈ వార్త అయితే సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వైరల్ అవుతూనే ఉంది. నిజానికి ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకోబోతున్నారని అంతకుముందు వార్తలు వచ్చాయి.

మధ్యలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా తీసుకోబోతున్నారని పుకార్లు వినిపించాయి. ఇలా చాలా రకాల వార్తలు ఈ సినిమాలో హీరోయిన్ పై వస్తూనే ఉన్నాయి. మరి ఇంతకీ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది చిత్రబృందం ఇప్పటికైనా క్లారిటీ ఇస్తే బెటర్ . అప్పుడైనా ఈ సినిమా హీరోయిన్ పై రూమర్స్ తగ్గుతాయేమో.

ఇక గతంలో ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం :