మహేష్ సినిమాపై పుకార్లను కొట్టిపడేసిన కొరటాల శివ!
Published on Oct 26, 2016 3:45 pm IST

koratala-siva
‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’.. ఇలా వరుసగా మూడు బ్లాక్‌బస్టర్ సినిమాలను తెరకెక్కించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయిన దర్శకుడు కొరటాల శివ, తన నాలుగో సినిమాను సూపర్ స్టార్ మహేష్‌తో చేయనున్న విషయం తెలిసిందే. ‘శ్రీమంతుడు’ లాంటి తిరుగులేని హిట్ ఇచ్చిన కాంబినేషన్ కావడంతో అనౌన్స్ అయిన రోజునుంచే ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు బయలుదేరాయి. జనవరి నెలలో సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ శరవేగంగా పూర్తవుతోంది. ఇదిలా ఉంటే ఒక మల్టీస్టారర్‌గా ఈ సినిమా తెరకెక్కనుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఈ ఉదయం ఇదే విషయంపై స్పందిస్తూ మహేష్‌తో తాను చేయబోయే సినిమాలో ఎటువంటి ఫ్యాన్సీ కాంబినేషన్లు లేవని, ఇదొక మల్టీస్టారర్ అని జరుగుతున్న ప్రచారాన్ని అభిమానులు పట్టించుకోవద్దని కొరటాల శివ కోరారు. మహేష్ ఇంటెన్సిటీకి తగ్గ స్థాయిలో ఒక బలమైన కథాంశంతో సినిమా నడుస్తుందని సమాచారం. డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ సినిమాను మహేష్‍ కెరీర్‌లో మరో మంచి సినిమాగా నిలిచేలా పనిచేస్తున్నామని కొరటాల శివ చెబుతూ వస్తున్నారు.

 
Like us on Facebook