ఇంట్రెస్టింగ్ టైటిల్, ఫస్ట్ లుక్ తో క్రిష్, వైష్ణవ్ ల సినిమా.!

Published on Aug 20, 2021 12:00 pm IST

మెగా సెన్సేషనల్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన మొదటి సినిమానే “ఉప్పెన” తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మరి ఈ చిత్రం అనంతరం విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో సినిమా స్టార్ట్ చేసి దానిని శరవేగంగా పూర్తి చేసేసాడు. అయితే ఈ చిత్రంపై కూడా మొదటి నుంచీ మంచి బజ్ ఉండగా ఎట్టకేలకు ఈ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని దానితో పాటలు రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసేసారు. ఈ చిత్రానికి “కొండ పొలం” అనే టైటిల్ ని ఫిక్స్ చేయగా దానితో పాటుగా ఆసక్తికర వీడియోని కూడా వదిలారు.

ఇందులో వైష్ణవ్ మరో ఇంటెన్స్ రోల్ లో కనిపిస్తున్నాడు. దీనితో ఈ చిత్రం పై కూడా మరింత ఆసక్తి పెరిగింది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని ముందు నుంచి చెబుతున్న అక్టోబర్ 8నే రిలీజ్ డేట్ కి ఫిక్స్ చేశారు. అంతే కాకుండా క్రిష్ మార్క్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా కీరవాణి సంగీతం అందించారు. అలాగే ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :