“ఎన్టీఆర్”, “వీవీఆర్”, “ఎఫ్2″ల కృష్ణా లేటెస్ట్ కలెక్షన్స్

Published on Jan 15, 2019 9:07 am IST

ఈ సంక్రాతికి తెలుగులో “ఎన్టీఆర్ కథానాయకుడు”, “వినయ విధేయ రామ”, “ఎఫ్2” ఈ మూడు తెలుగు పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ఎఫ్2 మంచి టాక్ తో ముందు వరుసలో నిలిచింది, మిగిలిన రెండు చిత్రాలు ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను రాబట్టడంలో కాస్త వెనుక బడ్డాయి.

కాగా కృష్ణా జిల్లా విషయానికొస్తే, సోమవారం నాటికీ ఎన్టీఆర్ కథానాయకుడు 5.47 లక్షల షేర్ చేయగా 6రోజుల మొత్తానికి 1.09 కోట్లు వసూలు చేసింది. వినయ విధేయ రామ విషయానికొస్తే సోమవారం 21.13 లక్షలు వసూలు చేయగా ఇప్పటివరకు 4రోజులకు గాను మొత్తం 2.42కోట్లు వసూలు చేసింది. మంచి టాక్ తో దూసుకుపోతున్న ఎఫ్2 సోమవారం 40.09 లక్షలు షేర్ వసూలు చేయగా,మూడు రోజులకు గాను 1.25కోట్ల షేర్ వసూలు చేసింది.

సంబంధిత సమాచారం :