సెల్యూట్ టు గుణశేఖర్ సర్ – కృష్ణవంశి.

సెల్యూట్ టు గుణశేఖర్ సర్ – కృష్ణవంశి.

Published on Nov 13, 2014 7:21 PM IST

nani-krishna-vamsi
సుమారు మూడేళ్ళ నుండి ‘రుద్రమదేవి’ సినిమా కోసం అహర్నిశలు శ్రమిస్తున్న దర్శకనిర్మాత గుణశేఖర్ పై ఓ దర్శకుడు ప్రసంశల వర్షం కురిపించాడు. సోషల్ మీడియాలో గుణశేఖర్ ‘రుద్రమదేవి’ మేకింగ్ వీడియోపై పొగడ్తలు కురిపిస్తూ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశి ఓ మెసేజ్ పోస్ట్ చేశారు.

‘ఇప్పడే గుణశేఖర్ గారి డ్రీం ప్రాజెక్టు ‘రుద్రమదేవి’ మేకింగ్‌ వీడియో చూశాను. మన సంస్కృతి సంప్రదాయాలకు, విలువలకు తిలోదకాలు ఇస్తూ.. అర్థం పర్థం లేని డైలాగులు, వల్గర్ & పిచ్చి పాటలతో తీసిన సినిమాలు రాజ్యమేలుతున్న సినిమా ఇండస్ట్రీలో భావోద్వేగభరితమైన సినిమా తీయాలని గుణశేఖర్ ప్రయత్నిస్తున్నారు. కేవలం ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకోవాలని అనుకోవడం లేదు. మన మెదడుకి పని కల్పిస్తున్నారు. ఓ మంచి సినిమా తీస్తున్నారు’ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.

మనం పుట్టిన గడ్డ గొప్పతనాన్ని తెలియజేసే సినిమా ఇది. 800 ఏళ్ళ క్రితం మన స్వేఛ్చ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహా యోధురాలి గాధ ఇది. మనం పీల్చే గాలి, ఈ స్వేఛ్చ కోసం ఆమె పోరాటం జరిపింది. అనుష్కను తప్ప ‘రుద్రమదేవి’ పాత్రలో ఇతర నటిని ఊహించుకోలేం. కాంట్ వెయిట్ టు వాచ్ ఇట్. అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

తాజా వార్తలు