‘రంగమార్తాండ’లో ఆమె పాత్ర చాల బలమైనదట !

Published on May 2, 2021 12:00 am IST

‘రంగమార్తాండ’ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి. కృష్ణవంశీ ఈ సినిమా కోసం బాగానే కష్టపడుతున్నాడు. ఎప్పుడూ లేనిది ఈ సినిమా కోసం కృష్ణవంశీ తన సినీ కెరీర్ లోనే తీసుకున్నన్నీ జాగ్రతలు తీసుకుంటున్నాడు. ఈ సినిమాతో తన వరుస ప్లాపుల పరంపరకు బ్రేక్ పడుతుందనేది కృష్ణవంశీ ఆశ. అది దృష్టిలో పెట్టుకుని ఈ సారి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాని చేస్తున్నాడు.

ప్రకాష్ రాజ్ కీ రోల్ లో ఈ రంగమార్తాండను సెట్ చేసుకున్నాడు. మరాఠీలో సూపర్ హిట్టయిన ఓ సినిమాను రంగమార్తాండగా తీసుకువస్తున్నాడు. అయితే ఈ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలనే కసితో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం కీ రోల్స్ లో రమ్యకృష్ణను, బ్రహ్మానందంను, అనసూయలను ఎంపిక చేసుకున్నాడు.

అలాగే మరో కీ రోల్ కోసం ప్రముఖ నటుడు రాజశేఖర్ కూతురు శివాత్మికాను ఎంపిక చేసుకున్నాడు. కాగా ఈ సినిమాలో అనసూయ పాత్ర చాల బలమైనదట, పైగా కృష్ణవంశీ ఈ పాత్రను చాల ప్రత్యేకంగా డిజైన్ చేశాడట. మొత్తానికి పాత్ర బలంగా ఉండటంతో అనసూయ నటన కూడా చాల బాగా ఎలివేట్ అవుతుందట.

సంబంధిత సమాచారం :