రంజిత్, పాలక్ లల్వానీ హీరో, హీరోయిన్లగా నటిస్తోన్న చిత్రం `జువ్వ`. ఎస్. వి. రమణ సమర్పణలో సొమ్మి ఫిలింస్ పై డా. భరత్ సోమి నిర్మిస్తోన్న ఈ సినిమాను త్రికోటి దర్శకత్వం వహిస్తున్నాడు. దిక్కులు చూడకు రామయ్య సినిమా తరువాత త్రికోటి దర్శకత్వం వహిస్తోన్న సినిమా ఇదే. ఇటీవల ఈ సినిమా టిజర్ ను చిరంజీవి ఆవిష్కరించారు.
ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఈ నెల 11న ఈ చిత్ర ఆడియో ను గ్రాండ్ గా విడుదల చెయ్యబోతున్నారు. ఈ వేడుకకి కేటిఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించగా కోటగిరి వెంకటేశ్వర్ రావ్ ఎడిటర్ గా పనిచేసారు. అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా ఈ సినిమా తెరకెక్కింది.


