ఎన్టీఆర్ సినిమాలో ‘లేడి సూపర్ స్టార్’ ?

Published on Apr 24, 2021 10:00 pm IST

‘లేడి సూపర్ స్టార్’ విజయశాంతి చాలా గ్యాప్ తరువాత దాదాపు 13 ఏళ్ల తరువాత సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సినిమాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటి నుండి చాలామంది దర్శకులు ఆమె కోసం తమ సినిమాల్లో పవర్ ఫుల్ క్యారెక్టర్స్ ను రాస్తున్నారు. ఈ క్రమంలో విజయశాంతి మరో సినిమాకి ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ – కొరటాల కలయికలో వస్తోన్న సినిమాలో కీలక పాత్రలో విజయశాంతి నటిస్తోందట. ఎంతైనా కొరటాల సినిమా అంటేనే భారీ తనం ఉంటుంది.

పైగా వరుసగా ఆరు సినిమాలతో ఫుల్ సక్సెస్ లో ఉన్న ఎన్టీఆర్ తో సినిమా అంటే, ఇక ఏ రేంజ్ లో సినిమా ఉంటుంది. అందుకే కొరటాల ఈ సినిమా కోసం భారీ తారాగణం ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. మరి ఎన్టీఆర్ తో విజయశాంతి నటన అంటే అందరిలో బాగా ఆసక్తి నెలకొంటుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీని తీసుకోబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అన్నిటికి మించి ‘లాస్ట్ టైం లోకల్ పరిధిలో రిపేర్ చేసాము, ఈ సారి ఫర్ చేంజ్ బోర్డర్స్ ను కూడా దాటబోతున్నాము’ అంటూ కొరటాల ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఇన్ డైరెక్ట్ గా ట్వీట్ రూపంలో చెప్పిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :