బిగ్ బాస్ అందుకే ‘లహరి’ని తప్పించాడా ?

Published on Sep 27, 2021 8:09 am IST

బిగ్‌ బాస్‌ హౌస్‌ లోకి మూడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన లహరి మొత్తానికి మూడో వారానికే బయటకు వచ్చేసింది. అయితే లహరి ఎలిమినేషన్‌ కు గల కారణాలేమిటంటే.. బిగ్‌బాస్‌ షో ప్రారంభమైన ఫస్ట్‌ వీక్‌ నుంచి లహరి ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసేది. దాంతో ఆమెను కొంతమంది బాగా విమర్శించారు.

ముఖ్యంగా ప్రియ, ప్రియాంక సింగ్‌, సిరి. లహరి కన్నింగ్‌ అంటూ.. అలాగే ఆమె డ్రెస్సింగ్‌ పై నెగిటివ్ గా ప్రచారం చేశారు. మొత్తానికి హౌస్‌లో లహరిని కొంత టార్గెట్‌ చేశారు. దీనికి తోడు లహరి ఇప్పటివరకు ఏ టాస్క్ గెలవలేదు. ఇక ఏమైనా ఎంటర్‌టైన్‌ చేసిందా? అంటే అదీ లేదు.

అన్నిటికి మించి లహరి పాపులారిటీ తక్కువ, అలాగే ఆమెకు పెద్దగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా లేదు. దాంతో ఆమెకు తక్కువ ఓట్లు నమోదైయ్యాయి. ఇక బిగ్‌ బాస్‌ త్వరలో ఓ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీకి ప్లాన్‌ చేశాడట. అందుకే లహరిని తప్పించారని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :