స్టార్ డైరెక్టర్ ని హెచ్చరించిన ఎన్టీఆర్ సతీమణి !
Published on Oct 29, 2017 3:48 pm IST

స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి తరచు ఏదో ఒక వివాదం పుట్టుకొస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రంపై స్పందించిన ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ‘వర్మ సినిమా తీయడంలో నాకెలాంటి అభ్యంతరం లేదు. ఆయన స్టోరీ విషయమై నన్ను కలవలేదు. కలిస్తే మాట్లాడతాను. ప్రస్తుతానికైతే ఎలా తీస్తున్నారో చూస్తున్నాను. విడుదలయ్యాక మాట్లాడతాను’ అన్నారు.

అలాగే వర్మ చరిత్రలో చిరిగిపోయిన పేజీలను బాగు చేసి చూపిస్తాననడం తనకు నచ్చిందని, అలాగే చేస్తే సంతోషిస్తానని, ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయానికి గుర్తింపు లేకుండా పోయిందని అంటూ వర్మ గనుక చెప్పినట్టు కాకుండా తన ఆత్మా గౌరవాన్ని దెబ్బతీసేలా సినిమా చేస్తే తప్పకుండా వ్యతిరేకిస్తానని, తనలోని పాత లక్ష్మీ పార్వతిని చూస్తారని హెచ్చరించారు. మరి ఇంత హాట్ టాపిక్ గా మారిన ఈ చిత్రాన్ని వర్మ ఏ విధంగా రూపొందిస్తారో చూడాలి.

 
Like us on Facebook