అమ్మమ్మ అయిన లక్ష్మీ రాయ్ !

ఖైదీ 150 చిత్రంలో ఓ ప్రత్కేక పాటకు చిరంజీవి సరసన డాన్స్ చేసి అలరించిన హీరోయిన్ లక్ష్మీ రాయ్. ఇప్పుడు ఆమె అమ్మమ్మ అయ్యింది. అమ్మ అవాల్సిన వయస్సులో అమ్మమ్మ ఏమిటి అనుకుంటున్నారా ? నేను అమ్మమ్మ అయ్యాను అని స్వయంగా లక్ష్మీ రాయ్ నే ట్వీట్ చేశారు. ఇప్పటినుంచి తన కుటుంబం పెద్దదైందని కూడా ఆమె తన ట్వీటర్ లో రాసుకొచ్చారు.

కాగా అసలు విషయానికి వస్తే లక్ష్మీ రాయ్ తన పెంపుడు కుక్కను తన బిడ్డలాగా చూసుకుంటుందట. ఇప్పుడు ఆ పెంపుడు కుక్కకి రెండు పిల్లలు పుట్టాయి. దాంతో లక్ష్మీరాయ్ తెగ ఆనందపడిపోతూ ‘నా వయస్సులోని వారు అద్భుతమైన అమ్మలు అవుతుంటే… నేను మాత్రం ఈ కవలలకు (కుక్క పిల్లలకు) అమ్మమ్మను అయ్యాను’ అంటూ కుక్క పిల్లలను ముద్దు పెట్టుకుంటున్న ఫోటోలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మూగ జీవాలను ప్రేమించడంలో హీరోయిన్స్ ఎప్పుడు ముందే ఉంటారు.