అవైటెడ్ “హను మాన్” ఓటిటి రిలీజ్ వచ్చేసింది.. కానీ

అవైటెడ్ “హను మాన్” ఓటిటి రిలీజ్ వచ్చేసింది.. కానీ

Published on Mar 9, 2024 7:59 AM IST

టాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “హను మాన్” ఇప్పుడుకీ కూడా థియేటర్స్ లో సెలవి దినం వచ్చిన ప్రతి సారి కూడా థియేటర్స్ లో ఊహించని అక్యుపెన్సీతో అదరగొడుతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లతో అదరగొట్టిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటిటిలో వస్తుందా అని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా పాన్ ఇండియా ఆడియెన్స్ అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఇప్పుడు ఫైనల్ గా ఓటిటి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రం ఈ మార్చ్ 16 నుంచి అయితే ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది. కానీ.. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈ చిత్రం హిందీలో అది కూడా జియో సినిమా లో స్ట్రీమింగ్ అయ్యేందుకు రాబోతుంది.

మరి సౌత్ ఇండియా భాషలకి సంబంధించి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. బహుశా సౌత్ లో కూడా అదే డేట్ లో జీ5 లో రావచ్చు. మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను, వినయ్ రాయ్ తదితరులు నటించగా హరీష్ గౌర సంగీతం అందించాడు అలాగే నిరంజన్ రెడ్డి నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు