బన్నీ “ఐకాన్”పై వైరల్ అవుతున్న లేటెస్ట్ బజ్!

Published on Aug 25, 2019 2:00 am IST

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రస్తుతం “అల వైకుంఠపురములో” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.అయితే తాజాగా బన్నీ నటించబోతున్న తన 21 వ సినిమా “ఐకాన్”కు సంబంధించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మాములుగా అల్లు అర్జున్ కు హిందీ ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే.అందుకు ఉదాహరణగా హిందీలో డబ్ అయిన అల్లు అర్జున్ సినిమాలకు వచ్చే స్పందనను బట్టి చెప్పొచ్చు.దీనితో హిందీ ఆడియెన్స్ కు బన్నీ బాగా దగ్గరయ్యారు.దీనితో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసారు.అయితే ఈ చిత్రంలో బన్నీ సరసన హీరోయిన్ గా దిషా పటాని పేరు ఫిక్స్ అయ్యిందని వినిపిస్తుంది.మరి బాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ ఎంట్రీ ఎలా ఉండబోతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :