“బలగం” ఓటిటి రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్.!

Published on Mar 22, 2023 8:30 pm IST

గడిచిన కొన్ని వారాల్లో అయితే పెద్దగా స్టార్ హీరోల సినిమాలు శుక్రవారం రిలీజ్ లకు రాలేదు కానీ ఒకో వారం మాత్రం మంచి కంటెంట్ తో కూడిన సినిమాలు టాలీవుడ్ లో రిలీజ్ అయ్యి సాలిడ్ ఎమోషన్స్ తో ఆడియెన్స్ ని అలరించాయి. మరి అలా వచ్చి భారీ హిట్ అయ్యిన క్లీన్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా “బలగం” కూడా ఒకటి. ప్రముఖ కమెడియన్ వేణు యెల్దండి దర్శకునిగా మారి చేసిన ఈ సినిమా భారీ హిట్ అయ్యింది. ప్రియదర్శి మరియు కావ్య కళ్యాణ్ రామ్ లు ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా నటించారు.

మరి మొదటి రోజు మరింత ఆదరణతో థియేటర్స్ లో దూసుకెళ్తున్న ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లో సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా ఇందులో ఈ సినిమా ఏప్రిల్ మొదటి వారంలో స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఆల్రెడీ వారు సినిమాకి సంబంధించి టెలివిజన్ లో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇక దీనిపై అధికారిక డేట్ అయితే కొన్ని రోజుల్లో రానుంది.

సంబంధిత సమాచారం :