గోపీచంద్ “సీటిమార్” రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్!

Published on Mar 30, 2021 6:02 pm IST

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “సీటీమార్”. దర్శకుడు సంపత్ నంది మరియు గోపీచంద్ ల కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ వచ్చే వారం ఏప్రిల్ 2వ తారీఖునే విడుదల కావాల్సిన ఈ చిత్రం కొంత గ్రాఫికల్ వర్క్ బ్యాలన్స్ ఉండటం మూలాన ఆగాల్సి వచ్చింది.

కానీ మళ్ళీ ఎప్పుడు విడుదల అవుతుంది అన్నది ఇంకా సస్పెన్సు గానే ఉంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఈ చిత్రం విడుదలపై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏప్రిల్ 30న విడుదల చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే దీనిపై అధికారిక క్లారిటీ కూడా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :