ప్రభాస్ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్.!

Published on Sep 17, 2020 6:32 pm IST

ఒకదాన్ని మించిన మరొక ప్రాజెక్ట్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. దాదాపు 1000 కోట్లకు పైగా బడ్జెట్ ఉన్న చిత్రాలను తన గుప్పిట్లో పెట్టుకున్న ప్రభాస్ నుంచి ఎప్పటి నుంచో ఒక మోస్ట్ వైటెడ్ ప్రాజెక్ట్ కు సంబంధించి అప్డేట్ రావాల్సి ఉంది. అదే దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయబోయే ప్రాజెక్ట్.

కేజీయఫ్ చాప్టర్ 1 తో పాన్ ఇండియన్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు చాప్టర్ 2 షూట్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మాసివ్ కాంబో నుంచి ఒక అధికారిక అప్డేట్ వస్తుంది అని ఎప్పటి నుంచో ఓ వార్త ఊరిస్తూ వస్తుంది. ఈ కాంబోకు సంబంధించి అధికారిక అప్డేట్ తొందరలోనే రానున్నట్టు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. మరి బహుశా వచ్చే నెలలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఏమన్నా అనౌన్స్ చేస్తారో ఏమో చూడాలి. మొత్తానికి ఈ భారీ ప్రాజెక్ట్ పై కూడా మంచి అంచనాలు నెలకొంన్నాయి.

సంబంధిత సమాచారం :

More