పవన్ సినిమా ప్రీ లుక్ ఆ రోజేనా ?
Published on Oct 30, 2017 3:34 pm IST


పవనే స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల కలయికలో రూపొందుతున్న సినిమాకు సంబందించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ వంటివి ఎప్పుడు బయటికొస్తాయో తెలీక ఫ్యాన్స్ కొంత గందరగోళానికి గురవుతున్నారు. ఈ నైపథ్యంలో సినిమాకు సంబందించిన టైటిల్ లోగో నవంబర్ 6న రిలీజవుతుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

ఎందుకంటే ఆరోజు దర్శకుడు త్రివిక్రమ్ పుట్టిన రోజు కాబట్టి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని టీమ్ ఈ ప్లాన్ చేశారట. మరి పుట్టినరోజుల్ని ఎలాంటి ఆడంబరాలు లేకుండా గడిచిపోనిచ్చే త్రివిక్రమ్ ఈ ఆలోచనకు ఒప్పుకుంటారో లేదో చూడాలి. ఇకపోతే చిత్రం టీమ్ మొత్తం షూట్ కోసం యూరప్ బయలుదేరి వెళ్లారు. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 10న రిలీజ్ చేయనున్నారు.

 
Like us on Facebook