సర్కారు వారి షూట్ అప్పటి నుంచి ఏమో అట.!

Published on May 5, 2021 7:00 am IST

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే భారీ మాస్ ఫ్లిక్ తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ చిత్రం ఇప్పటికే కొంత మేర షూట్ కూడా కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సాలిడ్ చిత్రం రెండో షెడ్యూల్ కూడా స్టార్ట్ చేశారు కానీ మళ్లీ కోవిడ్ రెండో వేవ్ కారణంగా నిలిపివేశారు.

మరి ఈ షెడ్యూల్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారో అన్నది తెలుస్తుంది. మేకర్స్ ఆ షూట్ ను వచ్చే జూన్ నెలలో ప్లాన్ చెయ్యాలని చూస్తున్నారట. అప్పటికి పరిస్థితులు మెరుగవ్వచ్చని అనుకుంటున్నారట. మరి ఇంకో నెల ఉండేసరికి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. ఇప్పటికే మళ్లీ షూటింగులు సినిమా విడుదలలు కూడా నిలిచిపోయాయి. అవన్నీ త్వరగా చక్కబడాలని ఆశిద్దాం..

సంబంధిత సమాచారం :