స్టార్ హీరో సినిమా గురించి వస్తోన్న వార్తలో నిజం లేదు !
Published on Mar 8, 2018 5:00 pm IST

శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ నటిస్తోన్న ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా ఈరోజు ఉదయం ప్రారంభమయ్యింది. ఏప్రిల్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. అను ఇమ్యాన్యుల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

సినిమా పేరు ‘అమర్ అక్బర్ ఆంటోని’ కాబట్టి ఈ మూవీలో రవితేజ మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ అందులో నిజం లేదని, సోలో పాత్రలో రవితేజ నటిస్తున్నాడని చిత్ర వర్గాల నుండి సమాచారం. మరి ఈ సినిమాకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరుకు ఆగాల్సిందే. ప్రస్తుతం రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 
Like us on Facebook