లేటెస్ట్ : ఓటిటి లో ఆ భాషలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హను మాన్’

లేటెస్ట్ : ఓటిటి లో ఆ భాషలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హను మాన్’

Published on Mar 17, 2024 2:00 AM IST

Hanu Man

యువ నటుడు తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియన్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ హను మాన్. ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ మూవీని నిరంజన్ రెడ్డి నిర్మించగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించారు.

విషయం ఏమిటంటే, ఫైనల్ గా ఈ మూవీ హిందీ వర్షన్ లో ఓటిటి ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటిటి మాధ్యమం జియో సినిమాలో హను మాన్ హిందీ వర్షన్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు చేసిన హను మాన్ మూవీ ఇతర భాషల ఓటిటి రిలీజ్ పై త్వరలో క్లారిటీ రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు